విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త

vinnaaraa vinnaaraa shubhavaartha shubhavaartha

🎵 TG-2911🌐 Telugu
పల్లవి

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2) ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2)      ||విన్నారా||

1వ చరణం

దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా||

2వ చరణం

ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా

Report Error