విశ్వాకాశము లాదులను సృష్టించిన విభుఁ
vishvaakaashamu laadulanu srusstinchina vibhum
విశ్వాకాశము లాదులను సృష్టించిన విభుఁ డగు పరమ ఈశుఁడు సర్వశక్తుఁ డగు ||విశ్వాకాశము లాదులను|| నమ్ముదును నే నమ్ముదును ||విశ్వాకాశము లాదులను||
పరిశుద్ధాత్ముని మూలమున మరియ కన్యకా గర్భమున ధరియింప బడి పుట్టిన శ్రీ గురు ప్రభుయేసును నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||విశ్వాకాశము లాదులను||
పొంతి పిలాతుని కాలమున నెంతో శ్రమపడి సిల్వఁబడి వింతగ యధోతుల మందెనని ||విశ్వాకాశము లాదులను||
మూఁడవనాఁడు మృతి నుండి వడిగాఁ బునరుత్థానుండై చూడఁగ బరమున కేతెంచె నాధుని కుడియెఁడ గూర్చుండెన్ ||విశ్వాకాశము లాదులను||
అక్కడ నుండి యిహమునకుఁ గ్రక్కున వచ్చి సజీవులకు నిక్కము న్యాయముమృతులకును జక్కగఁ దీర్చెడు నని మదిని ||విశ్వాకాశము లాదులను|| నమ్ముదును నే నమ్ముదును ||విశ్వాకాశము లాదులను||
పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||విశ్వాకాశము లాదులను||
పరిశుద్ధ పరచంబడిన సర్వసాధారణ సంఘం పరిశుద్ధుల యన్యోన్య మగు పరిశుద్ధ స్నేహము కల వంచు ||విశ్వాకాశము లాదులను||
మహికర్మ పరిహారమును దేహ పునరుత్థానము బహుళము నిత్య జీవమును మహిమ యనంతమై వెలయు నని ||విశ్వాకాశము లాదులను||