విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు
vishvaasa phalithamulu vishadammugaa neeku
విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా ||విశ్వాస ఫలితములు||
ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే ||విశ్వాస ఫలితములు||
దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును ||విశ్వాస ఫలితములు||
నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును ||విశ్వాస ఫలితములు||
ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా ||విశ్వాస ఫలితములు||
మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న ||విశ్వాస ఫలితములు||
సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్ బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్ ||విశ్వాస ఫలితములు||
విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు ||విశ్వాస ఫలితములు||