వ్యర్ధము వ్యర్ధము సోదరా యేసులేని బ్రతుకు నీకు వ్యర్ధమే
vyardhamu vyardhamu soodaraa yeesuleeni bratuku niiku vyardhamee
పల్లవి
వ్యర్ధము వ్యర్ధము సోదరీ యేసులేని రోజంతా వ్యర్ధమే యేసుని నమ్ముకుంటే స్వర్గమే స్వర్గమే యేసుని నమ్మకుంటే నరకమే నరకమే
1వ చరణం
మణులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా తరగని ధనరాసులు నీ ఇంట ఉన్నా బంధూబలగాలు అమితముగా నీకున్నా పాపాలను క్షమియించే యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||
2వ చరణం
సృష్టిని పరికించే జ్ఞానము నీకెంతున్నా సృష్టిని పూజించే అనుభవమే నీకున్నా చిత్ర చిత్ర పనులు చేసి చరిత్రకే ఎక్కుతున్నా ఈ సృష్టి కి మూలమైన యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||
3వ చరణం
కవుల కల్పనతో దేవుళ్ళను చేసుకున్న భక్తిలో భ్రమ చెంది గోపురాలు కట్టుకున్నా మతమౌఢ్యం రేపుకుంటూ రాజ్యాలే ఏలుతున్నా దేవుళ్ళకు దేవుడైన యేసయ్య లేకున్నా ||వ్యర్ధము||