యే సొసంగె గొప్ప యాజ్ఞను

yee sosange goppa yaajnyanu

🎵 TG-273💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప యాజ్ఞను దాసులునుగఁ జేయ బోయి ధరణిమీఁది రాష్ట్రములకు ఆ సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుఁడనుచు ||యే సొసంగె||

1వ చరణం

జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్యఁ చనుడు మీరు సకల దిశలను తనయు లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ బొందవచ్చుఁ దగిన రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను ||యే సొసంగె||

2వ చరణం

బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలిఁ జూపు క్రీస్తు సెలవున బాలు రందుఁ బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు సేయ గోరి సకల కాలముల యందు ||యే సొసంగె||

3వ చరణం

పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందుఁ గలుగు మనుజు లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు ||యే సొసంగె||

Report Error