యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి
yeesee naa pari haari - priya yeesee naa parihaari
పల్లవి
నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి
1వ చరణం
ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి
2వ చరణం
నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి
3వ చరణం
మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి
4వ చరణం
బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి
5వ చరణం
దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను