యేసు దేహము సంఘము ప్రభు

yeesu deehamu sanghamu prabhu

🎵 TG-259💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు దేహము సంఘము ప్రభు క్రీస్తుపై వి శ్వాస మమరి క్రా లెడు జనము యేసు ప్రాయశ్చిత్త రక్తము దోసములను బాపు నంచు నాసతోడ నమ్మి తమ ప్ర యాసములను దీర్చుకొన్న ||యేసు దేహము||

1వ చరణం

స్థాపకుఁడు యెహోవా దేవుఁడు పాపులను గావ నోపి సుతునిఁ బంపె కరుణుఁడు ఈ పవిత్ర సంఘమునకు దీపము పరిశుద్ధ వేద మేపుమీఱు శిరసు క్రీస్తు కాపుకర్త పావనాత్మ ||యేసు దేహము||

2వ చరణం

వరుఁడు క్రీస్తు యేసునాధుని మురువంపు వధువై పరఁగు నహ విశేషఖ్యాతిని సరిగెపట్టు నారచీర లరయ నీతి న్యాయము లవి యురుతరా భరణముల సుం దరము భక్తి వర్తనంబు ||యేసు దేహము||

3వ చరణం

తన యమూల్య రక్తముఁ దెచ్చి యనురక్తుఁ డీమె కనిశ శుల్క దా నమునిచ్చి ఘనుఁ డగు నా పావనాత్మ తనకుఁ దోడుజేసి మంచి పని తనమున నీమె కొక్క భవనముఁ గట్టంగఁ బోయె ||యేసు దేహము||

4వ చరణం

మరణ విజయుఁ డైన వీరుఁడు మహాబ్రములపై నరుగుదెంచు మహిమ శూరుఁడు నిరతప్రేమ కాముఁ డీమె కరముబట్టి పెండ్లి యాడఁ ద్వరగ వచ్చుఁ గాన భక్తి పెరుగు బ్రతుకు టుత్తమంబు ||యేసు దేహము||

Report Error