యేసు క్రీస్తుని గొల్వ రన్న
yeesu kreesthuni golva ranna
యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ జగతిలోన నెవ్వరు లేరు వాని కన్న యేసుని వాక్యము ఎవ్వరి కబ్బునో దోసము విడి పర వాసము దొరకును ||యేసు క్రీస్తుని||
సత్యుఁడు నిత్యుఁడాయ నన్న యీ సర్వ సృష్టిఁ జక్కఁగ సలిపి నిలిపె నన్న వ్యత్యాసము లే మియు లేకుండఁగ సత్యుండు చేసెను సర్వజగం బును ||యేసు క్రీస్తుని||
నిరాకారుఁడు నిశ్చయుఁడన్న నరుల రక్షింప నరావతారుఁడై నాఁడన్న నరుల పాపములుఁ పరిహరించుట కొరకై మరియ కొడుకై పుట్టెను ||యేసు క్రీస్తుని||
పరిశుద్ధవంతుఁ డాయ నన్న ప్రభు యేసు నందఁ పాపమే గానఁ బడుట సున్న పరులను గావను ధరలోఁ దిరిగెను నరుల నడుమ బహు నిరపరాధముతో ||యేసు క్రీస్తుని||
భేదాభేదములు గాని బోధ నాధుఁడొనరించె సాధు లెల్లను సంతోషింప బాధలుఁబడు స ద్రిక్తులతోడను సాదర వాక్కులు జక్కగ పలికెను ||యేసు క్రీస్తుని||
మహిలోన మనుజు లెవ్వ రైనఁ జేయ లేనట్టి మహిమాద్బుతములఁ జేసె నన్న మహా రోగులను మఱి మృతులను మహా మహుండు స్వస్థుల మఱి గావించెను ||యేసు క్రీస్తుని||
వర్ణింప వలనుకాని వాఁడు మన కోసర మతడు మరణమై మరల బ్రతికినాడు పరలోకమునకు మరి వేంచేసిన పరుఁ డగు క్రీస్తుని పాదముఁ బట్టుము ||యేసు క్రీస్తుని||
పరిశుద్ధ దూతల నాదముతో ప్రభు యేసు క్రీస్తు ప్రకాశ వస్త్ర మహిమలతోఁ పరమునుండి బహు త్వరగా వచ్చును ధరలో నమ్మిన నరులను బ్రోచును ||యేసు క్రీస్తుని||
న్యాయంబు దీర్చు దినము గలదు నమ్మని వారెల్ల సాయంబు వెదకినను గనపడదు సువార్త న్యాయముఁ దీర్చును నడవడి చొప్పున నమ్మని పాపుల నరకము జేర్చును ||యేసు క్రీస్తుని||
నమ్మండీ నష్టము నొందక యేసుని నమ్మిన పొమ్మని చెప్పఁడు సుమ్మండి ఇమ్ముగఁ గృపతో నిలలోఁ గాచును పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును ||యేసు క్రీస్తుని||