యేసు లేచెను ఆదివారమున యేసు
yeesu leechenu aadivaaramuna yeesu
పల్లవి
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను ||యేసు లేచెను||
1వ చరణం
వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ గానే ||యేసు లేచెను||
2వ చరణం
సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి లేచె నహహ ||యేసు లేచెను||
3వ చరణం
మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని తెల్పి ||యేసు లేచెను||
4వ చరణం
స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము తొల్గ ||యేసు లేచెను||
5వ చరణం
పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద మొంద ||యేసు లేచెను||
6వ చరణం
యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ లేతురండి ||యేసు లేచెను||