యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు నే నీ సుమార్గముఁ బట్టితి నా స్వజనము లనాదరంబునఁ త్రోసినను పగజేసిన నా సమస్తము నీవెగా యిక నే సరకుగొన నేమియున్ ||యేసు! నా||
ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ లన్ని భిన్నము నొందిన నన్ను ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక నన్నుఁ గదుపున దెవ్వరు ||యేసు! నా||
ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ కుండవు పతితుఁడై నీ దాపు జేరిన వానికిన్ దాప మాపుచు సంతసంబిడి ధన్యుఁ జేయుదు వీవెగా ||యేసు! నా||
నినుఁ బ్రేమించెడు తండ్రిని నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్ ||యేసు! నా||
విశ్వాస కవచంబును మేను నిడి విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు నడుపు విశ్వసితము లభించునట నీ విన్నపము స్తుతి యౌనుగా ||యేసు! నా||