పల్లవి
యేసు నామము స్మరించు బాధ నీకుఁ గల్గఁగా నద్ది క్షేమ సౌఖ్య మిచ్చు దాని స్మరియించుము. ||యేసు నామము||
1వ చరణం
యేసు నామము స్మరించు శోధనంబు లుండఁగా డాలుగాను దాని నెంచి వేఁడుమా సునామమున్ ||యేసు నామము||
2వ చరణం
మమ్ముఁ జేరఁదీయు యేసు నామము స్తుతింపఁగా మాధుర్యంపు నామ మౌను ఆత్మ కద్ది తుష్టియే ||యేసు నామము||
3వ చరణం
మ్రొక్కుచుందు మేసు నాధ నీదు పాద పద్మముల్ మోక్షమందుఁజేరఁగాను హెచ్చుగా నుతింతుము ||యేసు నామము||