యేసు నీ స్వరూపమును నేను

yeesu nee svaruupamunu neenu

🎵 TG-2500🌐 Telugu
పల్లవి

యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2) నీ పోలికగా నేను మారేదన్ (2)       ||యేసు||

1వ చరణం

యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను నీదు వినయముతో నింపుము ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను నీ ప్రేమతో నింపుము యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్ నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము

Report Error