పల్లవి
దిన దినము నాయెడల - నీ కృప విస్తరించు చున్నది - 2 నీ కృప విస్తరించు చున్నది.
1వ చరణం
ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు నా చేయిపట్టి నడిపేవారు ఈలోకమందు కానరారే -2 అయితే తల్లిగా, తండ్రిగా నీవే వున్నావు నీదు ప్రేమతో నా చేయిపట్టి నడుపుచున్నావు - 2 "దినదినము"
2వ చరణం
నా యోగ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు ఆధరణా చూపేవారు అయిన వారుకానరారే - 2 అయితే స్నేహమై, బంధమై నీవే వున్నావు అన్నివేళలా ఆధరణ చూపుచున్నావు - 2 " దినదినము"
3వ చరణం
కష్టాలు తీర్చేవారు ఒక్కరైనా కానరారే ఓదార్పునిచ్చేవారు ఎవరు నాకు లేనేలేరే - 2 అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే వున్నావు నిత్యము నీ సన్నిధిలో బలపరుచుచున్నావు - 2 "దినదినము"