యేసు పదాంబుజ శరణం నర

yeesu padaanbuja sharannam nara

🎵 TG-092💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం ||యేసు పదాంబుజ||

1వ చరణం

దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం ||యేసు పదాంబుజ||

2వ చరణం

పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం ||యేసు పదాంబుజ||

3వ చరణం

పరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం ||యేసు పదాంబుజ||

4వ చరణం

నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ హితుడా నీతిప్రబోధక నీవే శరణం ||యేసు పదాంబుజ||

5వ చరణం

తేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం ||యేసు పదాంబుజ||

Report Error