యేసు పునరుత్థానమాయెను చావునొంది క్రీ

yeesu punaruththaanamaayenu chaavunondi kree

🎵 TG-220💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు పునరుత్థానమాయెను చావునొంది క్రీ స్తేను పునరుత్థానమాయెను యేసు పునరుత్థానమాయె దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలంబర వాసులుగఁ దాఁజేయు నిప్పుడు ||యేసు పునరుత్థానమాయెను||

1వ చరణం

బేధపడి యా సిల్వమీఁదను దుష్టాత్మ లాయన నాదరంబుగఁ బట్టి మోదను పాదుకొని ప్రేమన్మతిన్పరి పంధి జనుల గావుమంచును సాదరంబుగ వేఁడె తండ్రిని శత్రులను రక్షింప నిప్పుడు ||యేసు పునరుత్థానమాయెను||

2వ చరణం

దుష్టజను లేతెంచుచున్నారు నన్నుఁబట్టి చాలఁగ గష్టపెట్టఁ దలంచు కొన్నారు విష్టపంబున సిల్వమీఁదను వేదన క్రూరముగ బెట్టుచు భ్రష్టులైనను బాసిమీరఁక పారిపోయెదరంచు నిప్పుడు ||యేసు పునరుత్థానమాయెను||

3వ చరణం

ఆమహిన్పరి శుద్ధవంతుఁడై జన్మించె దేవుని నీయందున నీతిమంతుఁ డై యీ మహిని బోధింప దోష వి హీనుఁడైన నిరపరాధిని స్వామి ద్రోహిగ నెంచి యూదులు చంపి పూడిచిపెట్ట నిప్పుడు ||యేసు పునరుత్థానమాయెను||

Report Error