యేసు రాజుగా వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకొంటారు

yeesu raajugaa vachchu chunnaaddu - bhuulooka mantaa telusukonttaaru

🎵 TG-1193💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చు చున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు

1వ చరణం

మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు - పరిశుద్దులందరిని తీసుకు పోతాడు లోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం " యేసు"

2వ చరణం

ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది-ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ఈ సువార్త మూయబడున్‌ - వాక్యమే కరువగును " యేసు"

3వ చరణం

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును - ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును

4వ చరణం

ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగనీ మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట వంగిపోవును " యేసు"

5వ చరణం

క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-కనిపెట్టి ప్రార్ధనచేయి సిద్ధముగానుండు రెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి " యేసు"

Report Error