యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా
yeesu raajugaa vachchuchunnaadu bhuulookamanthaa
🎵 TG-2902🌐 Telugu
పల్లవి
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
1వ చరణం
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం ||యేసు||
2వ చరణం
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ఈ సువార్త మూయబడున్ వాక్యమే కరువగును వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగని మోకాళ్ళన్నీ యేసయ్య యెదుట వంగిపోవును క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు రెప్ప పాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి