యేసు వచ్చెడి వేళాయె సోదరులారా
yeesu vachchedi veellaaye soodarulaaraa
యేసు వచ్చెడి వేళాయె సోదరులారా కాశమేఘములతోను భాసురమగుతన నివాసంబునకుమనల దీసుకపోయిప్రకాశితులను జేయ ||యేసు వచ్చెడి||
నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి ఓరిమితో నుండరే భద్రముగా శత్రుయుపద్రవమును దాటి సిద్ధపడుఁడి ప్రభునియొద్ద నివసించుటకు ||యేసు వచ్చెడి||
తనువును బలిపెట్టిన మన రక్షకుఁడు ఘన మహిమలోకి వెళ్లి తన యింట స్థలములు మనకు సిద్ధముఁజేసి చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము. ||యేసు వచ్చెడి||
చాలారాత్రి గతించెను సోదరులారా వెలుగు సమీపించెను వేల దూతలతోడ యేసయ్యవచ్చును కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు వచ్చెడి||
శోధన కాలమీదే యీధరణిలో బాధలురావచ్చును నాధుఁడైన యేసుపాదముల కడనుండ యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు వచ్చెడి||
మనలను బ్రేమించుచూ మన పాపముల దనరక్తమున గడుగుచు ఘన దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత ||యేసు వచ్చెడి||