యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి

yeesukreesthu dorike neeni yeemikoduvinkeemi

🎵 TG-172💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము దోసకారి జనుల కెంతోఁ గ్రాసమవునా యేసు పేరు ||యేసుక్రీస్తు దొరికె||

1వ చరణం

తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద నెల్లకాలమందు నుంచు యేసుఁడే మా తండ్రియౌను ||యేసుక్రీస్తు దొరికె||

2వ చరణం

వల్లగాని వశములేని యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి దేవ కొమరుఁడే వేరెవరు లేరు ||యేసుక్రీస్తు దొరికె||

3వ చరణం

దండియైన గండములు మెండుగాను మముఁజుట్టిన తండ్రివలె మా దరికి వచ్చి గండములను గదిమిఁ బ్రోచున్ ||యేసుక్రీస్తు దొరికె||

4వ చరణం

సత్యము మార్గముతానె నిత్యజీవమింకా తానే భ్రుత్యుల మనకీయ మోక్షము భువిని రక్తమంత గార్చె ||యేసుక్రీస్తు దొరికె||

5వ చరణం

ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము భువిని బలిపెట్టినాఁడు ||యేసుక్రీస్తు దొరికె||

6వ చరణం

ఒడలు నిండా గాయములతో నడరు చుండమరల లేచి వెడలి పరమందునుండి వేడుకలు మాకంపినాఁడు ||యేసుక్రీస్తు దొరికె||

7వ చరణం

ఆశతోడఁ తన్ను నమ్ము యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు సాటి లేశమైనా లేరుసుండీ ||యేసుక్రీస్తు దొరికె||

Report Error