యేసుక్రీస్తు ప్రభువా మేము నీ
yeesukreesthu prabhuvaa meemu nee
యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు ||యేసుక్రీస్తు ప్రభువా||
పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు ||యేసుక్రీస్తు ప్రభువా||
సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు నీ కృప చాల యిలలోఁ దెల్పితివే ||యేసుక్రీస్తు ప్రభువా||
అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు మూఁడవ దినమున బ్రతికియు లేచితివే ||యేసుక్రీస్తు ప్రభువా||
పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా ||యేసుక్రీస్తు ప్రభువా||
దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు ||యేసుక్రీస్తు ప్రభువా||
నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను ||యేసుక్రీస్తు ప్రభువా||