యేసుని భజియింపవే మనసా నీ

yeesuni bhajiyinpavee manasaa nee

🎵 TG-080💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని ||యేసుని భజియింపవే||

1వ చరణం

ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు ||యేసుని భజియింపవే||

2వ చరణం

ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును ||యేసుని భజియింపవే||

3వ చరణం

లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును ||యేసుని భజియింపవే||

4వ చరణం

వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా ||యేసుని భజియింపవే||

5వ చరణం

నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా ||యేసుని భజియింపవే||

Report Error