పల్లవి
యేసుని జేరఁ వేగము రా మార్గముఁ జూపి వేదములో దాపున నుండి క్రీస్తు దయన్ రమ్మని పిల్చును. ||యేసుని జేరఁ||
1వ చరణం
బాలురమైన మమ్మును దా నెంతటి ప్రేమతోఁ బిలుచున్ యేసుని స్వీకరించుటకై వత్తుము వేగమే. ||యేసుని జేరఁ||
2వ చరణం
నా ముద్దు బిడ్డ రమ్మనఁగా నాతని ప్రేమ కన్పడఁగా నాయన నేఁడు నిన్చిలువన్ రానని యందువా? ||యేసుని జేరఁ||