యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము

yeesuprabhuvu yeruussaleemu praveeshinchina vidhamu

🎵 TG-594💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన మహిమ చూడగా జేసెను ఆ దినము ||యేసుప్రభువు యెరూషలేము||

1వ చరణం

భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా ప్రియమొప్పగతాను ||యేసుప్రభువు యెరూషలేము||

2వ చరణం

గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా ||యేసుప్రభువు యెరూషలేము||

3వ చరణం

పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని జయములు గొట్టిరి సంతోషముతోను ||యేసుప్రభువు యెరూషలేము||

4వ చరణం

కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువనగా ||యేసుప్రభువు యెరూషలేము||

5వ చరణం

చిగురుటాకు చెట్ల కొమ్మలను సొగసుగ మార్గములో బాగుగ పరిరచిరి భక్తిని చూపిరి సాగుచు జనులంతా ||యేసుప్రభువు యెరూషలేము||

6వ చరణం

యెరూషలేము గతిగని ప్రభువు ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరుషలేం దేవాలయమును పరిశుభ్రత చేసె ||యేసుప్రభువు యెరూషలేము||

7వ చరణం

మనలోనున్న పాపము లెల్ల మనుపును ఆ ప్రభువే ఘనకృపశాంతులు గల్గించియు మరి ననయము బ్రోచునిలన్ ||యేసుప్రభువు యెరూషలేము||

Report Error