యేసురాజు నీదు ప్రేమ నెంచ

yeesuraaju needu preema nencha

🎵 TG-166💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా దోషియైన నన్ను బ్రోవ నీసుప్రాణమిడితివా ||యేసురాజు నీదు||

1వ చరణం

మంచివాని కొరకు నొకఁడు మరణ మొందుటరుదుగా అంచితమగు ప్రేమ చేత మించి గాయము లొందినా ||యేసురాజు నీదు||

2వ చరణం

చెయ్యరాని దుష్కర్మములుఁ చేసి నే చెడియుండగా అయ్యో మ్రానుమీఁ దికీవు ఇయ్యకొని మోసితివా ||యేసురాజు నీదు||

3వ చరణం

గెత్సేమనె వనములోకిఁ జొచ్చి తండ్రికి చిత్తమై యిచ్చిన నా శ్రమలపాత్రన్ బుచ్చుకొని భరించినా ||యేసురాజు నీదు||

4వ చరణం

హస్తము,పాదము,ప్రక్కలు మస్తకపు గాయములలో విస్తరించి చిందె నీ ప్ర శస్త రక్తమంతయున్ ||యేసురాజు నీదు||

5వ చరణం

కొండమీద నిన్నుఁజూడ గుండెలదిరిపోవునే నిండు ప్రేమ చేత నావగు మెండుబాధల నోర్చినా ||యేసురాజు నీదు||

6వ చరణం

మరువలేను నీదు ప్రేమ మరణపరియంతంబు నా నరక బాధలన్ని నీవా కొరతపై వహించినా ||యేసురాజు నీదు||

7వ చరణం

నిన్నుదలఁచ నా నిరీక్షణ యున్నతము గానుండును యెన్నడు నీ మహిమను నా కన్నులారఁజూతునో ||యేసురాజు నీదు||

Report Error