పల్లవి
యేసుసామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును ||యేసుసామి నీకు||
1వ చరణం
యేసుసామి నీకె నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే. ||యేసుసామి నీకు||
2వ చరణం
నేను నీవాడను యేసు నీవును నావాడవు నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము. ||యేసుసామి నీకు||
3వ చరణం
నీకు నన్ను యేసు ప్రభూ ఈయనేనె యేగితి నీదు ప్రేమశక్తి నింపు నీదుదీవె నియ్యవే. ||యేసుసామి నీకు||
4వ చరణం
యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము. ||యేసుసామి నీకు||