యేసూ.. ఎంతో వరాల మనస్సూ
yeesuu.. enthoo varaala manassuu
🎵 TG-1810🌐 Telugu
పల్లవి
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ||
1వ చరణం
గాలి వానొచ్చి నడి యేటిలోన నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో.. కంట చూడంగ గాలాగిపోయే అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2) నీవే రేవంట ఏ నావకైనా కడలే నీవంట ఏ వాగుకైనా ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా||
2వ చరణం
దిక్కు లేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ.. జంతు బలులిచ్చే మూడాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా నిన్ను పొగడంగ నేనెంత వాడ నీటి మడుగులలో చేపంటి వాడ నా దారి గోదారిలో