యేసూ, నిన్ జూతు నిందుఁ

yeesuu, nin juuthu nindum

🎵 TG-284💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా అగోచరార్థముల్ నే ముట్టదున్ కృపన్ నేఁ బట్టకొందు గట్టిగా నీ మీఁద వేయుదున్ నా భారము.

1వ చరణం

నే దైవాహార మిందె తిందును ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్ భూభారముల్ నేఁ బారవేయు దున్ క్షమా సౌఖ్యంబు గల్గుఁ క్రొత్తగా. ||యేసూ, నిన్||

2వ చరణం

సంగీత భోజనాల కాలము ప్రభుండు నాకై బల్ల వేసెను విందారగించుచున్ నీ తోడి నా మాధుర్య స్వల్ప మైత్ర్రిన్ బెంచుదున్. ||యేసూ, నిన్||

3వ చరణం

సాయం బీవే, వేరే నా కెందుకు వేరే చేమీఁద నానుకొనను ప్రభూ, నిజంబుగా నీదే చాలును నీ శక్తిలోనె బలం బుండున్ ||యేసూ, నిన్||

4వ చరణం

పాపంబు నాది, నీతి నీదెగా నేరంబు నాది శుద్ధి నీదెగా నీ రక్త నీతియే నా వస్త్రముల్ నా కాశ్రయంబు శాంతస్థితులు ||యేసూ, నిన్||

Report Error