యెహోవ గద్దె ముందట జనంబులార

yehoova gadde mundata jananbulaara

🎵 TG-033💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి యెహోవ దేవుఁడే సుమీ సృజింపఁ జంపఁ గర్తయే

1వ చరణం

స్వశక్తిచేత నాయనే మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగాఁ దప్పంగ మళ్లీ చేర్చెను ||యెహోవ గద్దె||

2వ చరణం

సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధిచేతు మాయనన్ జగత్తు వేయి నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్ ||యెహోవ గద్దె||

3వ చరణం

ప్రభుత్వ ముండు నంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము ||యెహోవ గద్దె||

Report Error