యెహోవ నా ఆశ్రయం నా
yehoova naa aashrayam naa
🎵 TG-2172🌐 Telugu
పల్లవి
యెహోవ నా ఆశ్రయం నా విమోచన దుర్గము (2) నా ధ్యానం నా గానం యెహోవ నా అతిశయం (2) ||యెహోవ||
1వ చరణం
తన ఆలయాన నా మోర వినెను భూమి కంపించేలా ఘర్జన చేసెను మేఘాలు వంచి ఎగిరి వచ్చి జలరాసులనుండి నన్ను లేపెను ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ||
2వ చరణం
నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను నా గుండెకు శౌర్యము నేర్పెను జయము నాకు జన్మ హక్కు ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం (4) ||యెహోవ||