యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో

yehoova sannidhini nee sthoothragaanamuthoo

🎵 TG-583💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుఁడి ||యెహోవ సన్నిధిని||

1వ చరణం

ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు విభునకు నియ్యుఁడు విరివిగను ||యెహోవ సన్నిధిని||

2వ చరణం

రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది మీ రర్పించుఁడి ||యెహోవ సన్నిధిని||

3వ చరణం

శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును బాగుగ నియ్యుఁడి ప్రభుపేర ||యెహోవ సన్నిధిని||

4వ చరణం

వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ సన్నిధిని||

5వ చరణం

యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ సన్నిధిని||

Report Error