యెహోవా నీ మహిమ స్తవము

yehoovaa nee mahima sthavamu

🎵 TG-586💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యెహోవా నీ మహిమ స్తవము యేసుని సుందర మందిరము ఇది యెంతో నిత్య శుభకరము సాహసమున క్రై స్తవాళి తోడను స్నేహ మమర నీ శిష్యులు నిపు డీ గేహమునకు భ క్తిని జేరిరి నీ బాహు బలముఁ గ న్పపడ దీవించుము ||యెహోవా నీ||

1వ చరణం

ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ నికేతనంబులు ||యెహోవా నీ||

2వ చరణం

పరమండలంములం దుండి నీ కరుణఁ జల్లి యీ యాలయము పైని సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల నిమ్మని నెరి బ్రార్థింతుము ||యెహోవా నీ||

3వ చరణం

అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ మందిరములు గా ముందొనరించుచుఁ బొందుగ నలు దెస లందు నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతిఁ బొందుట కిందురాను నీ వింక నొనర్పుము ||యెహోవా నీ||

4వ చరణం

పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతోఁ దన క్షత రక్త మహౌ షధ మిడి ప్రోవను ||యెహోవా నీ||

5వ చరణం

ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలోఁ జేరియుండు దాని కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది సౌఖ్యమొందుదము ||యెహోవా నీ||

Report Error