యెహోవా నీ నామము ఎంతో బలమైనది
yehoovaa nii naamamu entoo balamainadi
పల్లవి
ఎంతో ఘనమైనది "యెహోవా"
1వ చరణం
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
2వ చరణం
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
3వ చరణం
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"
4వ చరణం
చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"
5వ చరణం
పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"
6వ చరణం
మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"