యెహోవాను గానాము - చేసెదము ఏకముగా
yehoovaanu gaanaamu - cheesedamu eekamugaa
పల్లవి
మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణిచెదము - ఆయనే దేవుడు మనకు "యెహోవా"
1వ చరణం
యుద్దా శూరుడేహోవా - నా బలము నా గానము నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా "యెహోవా"
2వ చరణం
ఫరో రధముల సేనలను - తన శ్రేష్టాది పతులను ఎర్ర సముద్రములోన - ముంచివేసెనెహోవా.. "యెహోవా"
3వ చరణం
నీ మహిమాతి శయమున - కోపాగ్ని రగులజేసి చెత్తవలె ధహించెదవు - నీ పై లేచు వారిని "యెహోవా"
4వ చరణం
దోపుడు సొమ్ము పంచు కొని - ఆస తీర్చు కొందును నాకత్తి దూసెదను - అని శత్రువు అనుకొనును "యెహోవా"
5వ చరణం
వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్దా మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా - నీ వంటి వాడెవడు "యెహోవా"
6వ చరణం
ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా సముద్రము మద్యను - ఆరిన నేలను నడచిరి "యెహోవా"