యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే

yuddhamu yehoovaadee - yuddhamu yehoovaadee

🎵 TG-1198💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

రాజులు మనకెవ్వరులేరు శూరులు మనకెవ్వరులేరు సైన్యములకు అదిపతియైన యెహోవా మన అండ (2)

2వ చరణం

వ్యాధులు మనలను పడద్రోసినా భాదలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ (2)

3వ చరణం

యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2)

4వ చరణం

అపవాది యైన సాతాను గర్జించు సింహమువలె వచ్చినా యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)

Report Error