కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే
konthaseepu kanapadi anthaloonee maayamayyee
కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు
konthaseepu kanapadi anthaloonee maayamayyee aavirivantidiraa ee jeevitham lookaana kaadeedi shaashvatham yeesee nija deevudu nithya jeevamisthaadu marannamaina jeevamaina ninnu viduvadu
ఎదురవుతారెందరో నీ పయనములో - నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణము వరకు - ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు ||యేసే||
eduravuthaarendaroo nee payanamuloo - nilicheedi endaroo nee akkaraloo vachcheedevaroo neethoo marannamu varaku - ichcheedevaroo aapai nithyajeevam neeku ||yeesee||
చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి - ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా - ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే - సంపాదన ఎవరిదగునో యోచించితివా ||యేసే||
chematoodchi sukhamu vidichi kasstamuloorchi - aasthulu sanpaadinchina shaanthi unnadaa - ee raathree deevudu nee praannamadigithee - sanpaadana evaridagunoo yoochinchithivaa ||yeesee||
నీ శాపము తానుమోసి పాపముతీసి - రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా-నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||యేసే||
nee shaapamu thaanumoosi paapamutheesi - rakssanna bhaagyamu neekai siddhamu cheesi vishraanthiniyyagaa ninnupiluvagaa-nirlakssyamu cheesinaa thappinchukunduvaa ||yeesee||