అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే (2) మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2) ||అయ్యా||
ayyaa vandanaalu.. ayyaa vandanaalu ayyaa vandanaalu neekee (2) mrutatulyamaina shaaraa garbhamunu – jeevinpacheesina neekee nireekshanee leeni naa jeevitaaniki – aadhaaramaina neekee aagipoovachchayyaa jeevitamu ennoo dinamulu ayinaa neevistaavayyaa vaagdhaana phalamulu (2) ||ayyaa||
అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2) ||అయ్యా||
avamaanameduraina abrahaamu bratukuloo – aanandamichchina neekee nammadagina deevudani nee vaipu choochutaku – nireekshananichchina neekee koolpooleedayyaa jeevitamu ninnee choodagaa jarigistaavayyaa kaaryamulu aashcharyareetigaa (2) ||ayyaa||