ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ
endukoo ee preema nanninthaga
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2) ఏ యోగ్యత లేని ఓటి కుండను నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో||
endukoo ee preema nanninthaga preeminchenu endukoo ee jaali naapai kuripinchenu (2) ee yoogyatha leeni ooti kundanu nee paathraga cheesi ennukuntivi enaleeni krupanichchithivi ||endukoo||
నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే అయినా నీవు క్షమియించినావే ఊహించని మేలులతో దీవించినావే నా సంకటములను కదా తీర్చినవే ఏ యోగ్యత లేని దీనుడను ఏమివ్వగలను నీ ప్రేమకు (నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో||
nee sannidhi palumaarlu nee veedinaanee ayinaa neevu kssamiyinchinaavee uuhinchani meelulathoo deevinchinaavee naa sankatamulanu kadaa theerchinavee ee yoogyatha leeni deenudanu eemivvagalanu nee preemaku (naa) sarvam neekee arpinthunu – (2) ||endukoo||
మా కొరకు బలి పశువై మరణించినావు మా పాప శిక్ష తొలగించినావు పలు విధముల శోధనలో తోడైనావు ఏ కీడు రాకుండ మేము కాచినావు రుచి చూపినావు నీ ప్రేమను ఆ ప్రేమలో నేను జీవింతును నీవే నాకు ఆధారము
maa koraku bali pashuvai maranninchinaavu maa paapa shikssa tholaginchinaavu palu vidhamula shoodhanaloo thoodainaavu ee keedu raakunda meemu kaachinaavu ruchi chuupinaavu nee preemanu aa preemaloo neenu jeevinthunu neevee naaku aadhaaramu