కొనియాడ తరమే నిన్ను కోమల
koniyaada tharamee ninnu koomala
కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు (2) ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ||
koniyaada tharamee ninnu koomala hrudaya – koniyaada tharamee ninnu thanaraaru dinakaru – benu thaaralanu minchu (2) ghana theejamuna noppu – kaanthimanthuda veevu ||koniyaada||
కెరుబులు సెరుపులు – మరి దూత గణములు నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు దోసంబులను మడియు – దాసాళి కరుణించి యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు నరులయందున కరుణ – ధర సమాధానంబు చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత
kerubulu serupulu – mari duutha gannamulu nurutharanbuga goluva – noppu shreesstthuda veevu sarva lookanbula – barvu deevuda vayyu nurvi sthree garbhaana – nudbhavinchithi veevu vishvamanthayu neelu – veeraasanuda vayyu pashvaallithoo dotti – pandiyuntivi veevu doosanbulanu madiyu – daasaalli karunninchi yeesu peeruna jagathi – keegudenchithi neevu narulayanduna karunna – dhara samaadhaananbu chirakaalamunu mahima – paraga jeeyudu veevu oo yeesu paanpuga – naa yaathma jeekoni shreeyamuga pavallinchu – shreekara varasutha