మనలో ప్రతి ఒక్కరి పేరు
manaloo prathi okkari peeru
మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2) హృదయాంత రంగములో బాధలు తెలుసు మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో||
manaloo prathi okkari peeru yeesuku thelusu manaloo prathi okkari uuhalu yeesuku thelusu (2) hrudayaantha rangamuloo baadhalu thelusu mana gunde loothulloo veedanalu thelusu jagaththu punaadi veeyabadaka mundee manalanu eerparachukunnaadu yeesayyaa (2) ||manaloo||
మనసులోని మాట నీవు పలుకకముందే ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు తల్లి గర్భమునందు నిను రూపించకముందే సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా ఆకాశ వీధులలో నీవు విహరించినా ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||
manasulooni maata neevu palukakamundee erigiyunnaadu – yeesu erigiyunnaadu thalli garbhamunandu ninu ruupinchakamundee suduura samudra diganthaalaloo neevu nivasinchinaa aakaasha veedhulaloo neevu viharinchinaa prabhu yeesu kreesthu ninnu viduvadu neesthamaa prabhu yeesuni nee hrudayamulooniki aahvaaninchumaa ||manaloo||
నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు
neevu nadichee daariloo neethoo sahavaasigaa yeesu unnaadu – prabhu yeesu unnaadu neevu maatlaadu veellaloo manchi sneehithunigaa nee yavvana kaalamuna prabhu yeesuni smariyinchi nee ontari samayamuloo kanneetithoo praardhinchu