మేఘాల పైన మన యేసు
meeghaala paina mana yeesu
మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2) సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల||
meeghaala paina mana yeesu thvaraloonee manakai vachchuchunnaadu (2) siddhapadumaa ullasinchumaa nee priyuni raakakai (2) ||meeghaala||
ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు బూర శబ్దం మ్రోగగా ప్రభుని రాకడ వచ్చును రెప్ప పాటున పరిశుద్ధులు కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల||
ee ghadiyoo ee veellayoo – theliyadu manaku buddhi kaligina kanyakalu vale – siddhapadiyundu buura shabdam mroogagaa prabhuni raakada vachchunu reppa paatuna parishuddhulu konipoobaduduru prabhuvuthoo ||meeghaala||
పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే వినుట వలన విశ్వాసం కలుగును సోదరా దేవుని ఆజ్ఞకు లోబడితే పొందెదవు పరలోకం స్తుతియు మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లు గాక తర తరములకు యుగయుగములు యేసే మారని దైవం నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ
paapam valana vachchhu jeetham – marannamee kaadaa deevuni krupayee kreesthu yeesuloo – nithya jeevamee vinuta valana vishvaasam kalugunu soodaraa deevuni aajnyaku loobadithee pondedavu paralookam sthuthiyu mahima ghanatha prabhaavam yeesukee chellu gaaka thara tharamulaku yugayugamulu yeesee maarani daivam nithyamu aanandamee prabhuvaa neethoo nunduta nuuthana yeruussaleemu cheerukoonutee nireekssanna