నన్ను గన్నయ్య రావె నా
nannu gannayya raave naa
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
nannu gannayya raave naa yeesu nannu gannayya raave naa prabhuvaa ||nannu||
ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను (2) పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి
mundu nee paadaaravindamu landu nishchala bhakthi preemanu (2) pondikagaa jeeyaraavee naa dendamaananda mananthamaiyupponga hadduleenatti duraashala naviveekinai kuudi yaadithi moddulathoo ninka kuutami vaddayya vaddayya vaddayya thandri kaalamu pekku gathinchenu garvaadu ledadegavaayenu ee lookamaaya sukheechchhalu chaalunu jaalunu jaalu noothandri daarunna sansaara vaaradhi dari juupi proova nee kannanu kaaranna guruvu linkevvaru leerayya – leerayya leerayya thandri naa vanti dusskarma jeevini keevalamagu needu peermini deevinchi rakssinpanippudee raavayya raavayya raavayya thandri