శోధనా బాధలు చుట్టినా నన్ను

shoodhanaa baadhalu chuttinaa nannu

🎵 TG-2511🌐 Telugu
పల్లవి

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2)       ||శోధనా||

1వ చరణం

నడవలేక నా పడవ నది సముద్రమందున నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2) చూచెనే యేసు చెంతకు చేరెనే ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా చూచెనే యేసు చేయి చాచెనే లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే

Report Error