స్తుతియించి కీర్తించి ఘనపరతును నా
sthuthiyinchi keerthinchi ghanaparathunu naa
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||
sthuthiyinchi keerthinchi ghanaparathunu naa yeesayyaa (2) neevee naa aaraadhana yeesayyaa neevee naa sthuthi paathrudaa naa yeesayyaa neevee naa aathmaloo aanandamayyaa neevee naa jeevitha makarandamayyaa ||sthuthiyinchi||
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా నీ ప్రజలను పోషించినావా అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు నీ ప్రజలను రక్షించినావు పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా మము పరముకు నడిపించు దేవా
gaaddhaandhakaaramuloona velugai nadipinchinaavaa agaadha jalamulaloona maargamu chuupinchinaavaa anudinamu mannaanu panpi prajalanu poossinchinaavaa nee prajalanu poossinchinaavaa agni gundamu nundi neevu vidipinchinaavu sinhapu nooti nundi marannamu thappinchinaavu prathi kssannamu neevu thoodugaa nundi prajalanu rakssinchinaavu nee prajalanu rakssinchinaavu paapamuloo unna maakai rakthamu chindinchinaavee marannamuloo unna maakai siluvaloo maranninchinaavee anudinamu maathoo neevundi mammu nadipinchu deevaa mamu paramuku nadipinchu deevaa