యేసయ్యా నా యేసయ్యా నాపై

yeesayyaa naa yeesayyaa naapai

🎵 TG-1522🌐 Telugu
పల్లవి

యేసయ్యా నా యేసయ్యా నాపై నీకెందుకింత ప్రేమయ్యా (2) నా పాపములను క్షమియించినావయ్యా నా దోషమును భరియించినావయ్యా నీ ప్రేమకు కొలతే లేదయ్యా నా దాగు చోటు నీవయ్యా (2)        ||యేసయ్యా||

1వ చరణం

ఆజ్ఞను వినని అవిధేయత నీ సన్నిధి నుండి తొలగించనీ ఉపద్రవములు నన్ను చుట్టుకొనగా ఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా లోకపు ఆశతో నిండియుండగా జీవపు ఢంబము మదిని చేరగా చెడిపోయి నేను తిరిగి రాగా నా రాకకై దారిలో వేచియుంటివి

Report Error