యేసుని నామములో – మన
yeesuni naamamuloo – mana
యేసుని నామములో – మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే – యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమునా జయమే ||యేసుని||
yeesuni naamamuloo – mana baadhalu poovunu dusstaathmalu paaripoovunu shoodhanaloo jayamochchunu mruthulaku nindu jeevamochchunu hrudayamuloo nemmadochchunu yeesu rakthamukee – yeesu naamamukee yugayugamulakuu mahimee abhissikthulagu thana daasulaku prathi samayamunaa jayamee ||yeesuni||
ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా ఆర్ధికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే ||
ghooramaina vyaadhulennainaa maarpuleeni vyasanaparulainaa aardhikamugaa lootulennunnaa aashalu niraashalee ainaa prabhuyeesuni namminachoo – neevu vidudalanondedavu parivarthana chendinachoo – paralookam cheeredavu ||yeesu rakthamukee ||
రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు
raajuvainaa yaajakudavainaa nirupeedavainaa brathuku chedivunnaa aashrayamugaa gruhamulennunnaa niluva needee neeku leekunnaa shree yeesuni naamamuna – vishvaasamu neekunnaa nee sthithi needeedainaa – nithyajeevamu pondedavu