ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా
aadiyanthamu leenivaadaa sanpuurnnudagu maa
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము||
aadiyanthamu leenivaadaa sanpuurnnudagu maa deevaa neethijnyaanamu kalavaadaa jyoothiki nilayamu neevee abraahaamunu pilichithivi – aa vanshamuna buttithivi anaadhulaku dikku neevee – anaadhudavai vachchithivi ||aadiyanthamu||
ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి
issaakunu vidipinchi – yeesayyaa baliyainaavaa yuudaachee nammabadithivi – paapulakai maranninchithivi yoonaavale muudu dinamul – bhuugarbhamuna neevundi maanavulanu rakssinpa – mahimathooda leechithivi pandrendu goothramula – jendi – pandrendu shissyula janakaa kanyaputhrudavai seeyoonu – kanyanu varinchithivi daaveedu kumaarudavu – daaveeduku deevudavu kaapaaduchu nunnaavu – paapini nannu preeminchi