ఆహా మహాత్మ హా శరణ్య
aahaa mahaathma haa sharannya
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా||
aahaa mahaathma haa sharannya – haa vimoochakaa drooha rahitha chanpe ninu naa – doossamee kadaa ||aahaa||
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై నీవు నాతో పరదైసున – నేడే యుందువు పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి అమ్మా నీ సుతుడ టంచు మరి-యమ్మతో పలికి క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా దప్పిగొనుచున్నాన టంచు – చెప్పితివి కదా యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా సమాప్తమైన దంచు తెలిపి – సమసితివి కదా అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా
veeralanu kssaminchu thandri – neerameemiyun kooritithula ninnu chanpu – kruura janulakai neevu naathoo paradaisuna – needee yunduvu paavanunda itlu paliki – paapi gaachithi ammaa nee suthuda tanchu mari-yammathoo paliki krammara nee janani yanchu – kartha nudithivi naa deeva deeva yeemi vida-naadithi vanuchu shree deeva sutha palikithivi shrama – cheppa shakyamaa dappigonuchunnaana tanchu – cheppithivi kadaa yippagidini baadha nonda – neemi neeku haa shrama pramaada-mulanu goppa – shabda meththi haa samaapthamaina danchu thelipi – samasithivi kadaa appaginthu thandri neeku – naathma nanchunu goppa yaarbhaatanbu cheesi – kuulipoothivaa