ఆకాశ పక్షులను చూడండి అవి
aakaasha pakssulanu chuudandi avi
ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి కోయవు గరిసెలలో దాచుకోవూ కొట్లలో కూర్చుకోవు ||ఆకాశ||
aakaasha pakssulanu chuudandi avi viththavu avi kooyavu gariselaloo daachukoovuu kotlaloo kuurchukoovu ||aakaasha||
అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి స్వార్ధము వంచన వాటికుండదు సాటివాని దోచుకొనే మనసు ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు పక్షులను పోషించే ఆ దేవుడు మనుష్యులను పోషించుట మానివేయునా సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ
anudinamu kaavalasina aahaaramu andajeeyunu vaatiki aa deevudu kalasikattugaa avi egiri poothaayi kadupu ninpukonipooyi marala thirigi vasthaayi svaardhamu vanchana vaatikundadu saativaani doochukonee manasu undadu reepatini guurchina chintha undadu puuta elaa gadapaalani baadha undadu pakssulanu poossinchee aa deevudu manussyulanu poossinchuta maaniveeyunaa srusstiloona manissi brathuku shreesstamu kadaa prabhuvu thoodu undagaa manaku enduku baadha