ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది
aalakinchudi priyuni svaramu vinabaduchunnadi
ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు ఆనందం ఆనందం ఎంతో ఆనందం ప్రియుడేసు సహవాసం ఎంతో సంతోషం
aalakinchudi priyuni svaramu vinabaduchunnadi idigoo naa priyudu vachchuchunnaadu aanandam aanandam enthoo aanandam priyudeesu sahavaasam enthoo santhoossam
దవళవర్ణుడు రత్నవర్ణుడు అతి పరిశుద్ధుడు ఎవరు సాటి లేరు పోటి కాదు ప్రియుడేసుకు ||ఆనందం||
davallavarnnudu rathnavarnnudu athi parishuddhudu evaru saati leeru pooti kaadu priyudeesuku ||aanandam||
ఆదరించి సేదదీర్చె ప్రియుడు నా వాడు హత్తుకొనును ఎత్తుకొనును ఎంత ధన్యుడను ||ఆనందం||
aadarinchi seedadeerche priyudu naa vaadu haththukonunu eththukonunu entha dhanyudanu ||aanandam||
పాపం తీసి శుద్ధి చేసి సౌందర్యము నిచ్చెను ప్రియుని పైన ఆనుకొనుచు సాగిపోయెదను ||ఆనందం||
paapam theesi shuddhi cheesi saundaryamu nichchenu priyuni paina aanukonuchu saagipooyedanu ||aanandam||
మేఘములపై ప్రియుడు త్వరగా రానైయున్నాడు మహిమ ధరించి మేఘములపై ప్రియుని చేరెదను ||ఆనందం||
meeghamulapai priyudu thvaragaa raanaiyunnaadu mahima dharinchi meeghamulapai priyuni cheeredanu ||aanandam||