ఆరని ప్రేమ ఇది
aarani preema idi
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2) అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని||
aarani preema idi – aarpajaalani jvaala idi (2) athi shreesstamainadi – anthamee leenidi avadhulee leenidi – akssayamaina preema idi kaluvari preema idi – kreesthu kaluvari preema idi (2) ||aarani||
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది
sinhaasanamu nundi – siluvaku digi vachchinadi balamainadi marannamu kannaa – mruthini gelchi leechinadi idi sajeevamainadi – idee sathyamainadi idee nithyamainadi – kreesthu yeesu preema idi naa sthaanamandu nilichi – naa shikssanee bhariyinchi kraya dhanamunu chellinchi – goppa rakssanna nichchinadi naaku viluva nichchinadi – nannu veliginchinadi aa unnatha raajyamandu – naaku sthaanamichchinadi unnatha preema idi – athyunnatha preema idi bhuu raajulu adhipathulu – raajyaalu adhikaaraalu cherayainaa khadgamainaa – karuvainaa eduraina evaru aarpaleenidi – evaru aapaleenidi pravahinchuchunnadi – prathi paapi chenthaku preema pravaahamidi – yeesu preema pravaahamidi